పైలట్‌ ప్రాజెక్టు పైపులైన్‌ సరిచేయండి

ABN , First Publish Date - 2020-10-25T10:40:35+05:30 IST

గడివలస సమీపం లోగల వేగావతి నదిపై ఏర్పాటుచేసిన పైల ట్‌ ప్రాజెక్టు పైపులైన్‌ను సరి చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పైలట్‌ ప్రాజెక్టు పైపులైన్‌ సరిచేయండి

పాచిపెంట: గడివలస సమీపం లోగల వేగావతి నదిపై ఏర్పాటుచేసిన పైల ట్‌ ప్రాజెక్టు పైపులైన్‌ను సరి చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వేగావతి నదిపై ఉన్న సబ్‌మెర్జిబుల్‌ బ్రిడ్జిని ఆనుకుని పైలట్‌ ప్రాజెక్టు పైపులైన్‌ వరద ఉధృతికి బ్రిడ్జి మధ్యలోకి కొట్టుకొచ్చి నిలిచి పోయింది. దీంతో మండలంలో గల పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. దిమ్మలతో కూడిన పైపులైన్లు జేసీబీ సాయంతో బ్రిడ్జి అంచుకు యథా విధిగా ఏర్పాటు చేశారు. అయితే పెద్దగెడ్డ నీరు విడుదల చేసినట్లయితే మరళా పైపులైన్‌ అడ్డంగా వచ్చే అవకాశం ఉంది. శాశ్వతంగా పైపులైన్‌ కదలకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-10-25T10:40:35+05:30 IST