సేవాలాల్‌ జెండా ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-02-16T04:20:02+05:30 IST

మండలంలోని కైరిగూడ గ్రామంలో మంగళవారం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా జెండా ఆవిష్క రించి బోగ్‌ బండార్‌ కార్యక్రమం నిర్వహించారు.

సేవాలాల్‌ జెండా ఆవిష్కరణ
కైరిగూడలో పూజలు నిర్వహిస్తున్న నాయకులు

రెబ్బెన, ఫిబ్రవరి 15:మండలంలోని కైరిగూడ గ్రామంలో మంగళవారం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా జెండా ఆవిష్క రించి బోగ్‌ బండార్‌ కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో బీజే పీ నియోజక వర్గ కన్వీనర్‌ అజ్మీరా ఆత్మారాం, నాయకులు సుబ్బా రావు, హరినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్‌: లింగాపూర్‌ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని బంజార తండాలలో సద్గురు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని మంగళవారం ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా బోగ్‌ బండార్‌ కార్యక్రమం నిర్వహించారు.
కెరమెరి: మండల కేంద్రంతో పాటు మండలంలోని అనార్‌పల్లి, దేవాపూర్‌, తుమ్మగూడ గ్రామాల్లో సేవాలాల్‌ జయంతి వేడుకలను అధికారులు అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ దృపతాబాయి, వైస్‌ ఎంపీపీ అబ్దుల్‌ కలాం, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉత్తంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి: బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవలాల్‌ మహారాజ్‌ జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిం చారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరే పెంటు, టీఆర్‌ఎస్‌  నాయకులు దీపక్‌ముండే, జైరాం పాల్గొన్నారు.     

Updated Date - 2022-02-16T04:20:02+05:30 IST