ప్లాటు లీజు వ్యవహారంలో గొడవ.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-27T12:07:51+05:30 IST

ఓ ప్లాటు లీజు వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు

ప్లాటు లీజు వ్యవహారంలో గొడవ.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు

హైదరాబాద్/హయత్‌నగర్‌ : ఓ ప్లాటు లీజు వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన హయత్‌నగర్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తట్టిఅన్నారం ఇందు అరణ్య సమీపంలో ఉంటున్న చామల మధుసూధన్‌రెడ్డికి సర్వేనంబర్‌ 1లో 300 గజాల స్థలం ఉంది. ప్లాటును అమెరికాలో ఉంటున్న అల్లుడు దీక్షిత్‌రెడ్డికి ఇచ్చాడు. ప్లాట్‌ కేర్‌ టేకర్‌గా మధుసూధన్‌రెడ్డి భార్య అరుణ ఉన్నారు. 2017, నవంబర్‌ 28న న్యాయవాది వెంకట్‌రాంరెడ్డితో నెలకు రూ. 9వేలు అద్దె చెలించేలా వారు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. గడువు పూర్తయినా ఖాళీ చేయకుండా వెంకట్‌రాంరెడ్డి కోర్టులో కేసు వేశాడు. దీంతో వివాదం కోర్టులో నడుస్తోంది. 


శుక్రవారం కేసు మధుసూదర్‌రెడ్డి హయత్‌నగర్‌ కోర్టుకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లాడు. ప్లాటు వద్ద జూనియర్‌ న్యాయవాది పరమేశ్వర్‌రెడ్డికి, మధుసూధన్‌రెడ్డి మధ్య ఘర్షణ జరగింది. మధుసూధన్‌రెడ్డికి రక్తస్రావం అయింది. ఇరువురికి రక్తం మరకలు అంటడంతో జూనియర్‌ న్యాయవాది పరమేశ్వర్‌రెడ్డి మధుసూధన్‌రెడ్డి తనపై హత్యాయత్న చేశాడని  హయత్‌నగర్‌ పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మధుసూధన్‌రెడ్డి కూడా జూనియర్‌ న్యాయవాది తనపై దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదులను తీసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా లీజుకు తీసుకున్న ప్లాటులో రెండు అంతస్తుల భవనం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీక్షిత్‌రెడ్డి పేరుతో నకిలీ అనుమతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-27T12:07:51+05:30 IST