పొగమంచుతో విమానాల ఆలస్యం

ABN , First Publish Date - 2021-03-08T09:30:33+05:30 IST

దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి.

పొగమంచుతో విమానాల ఆలస్యం

గన్నవరం, మార్చి 7: దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఆదివారం ఉదయం పొగమంచు 9గంటల వరకూ ఉండటంతో బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన స్పైస్‌ జెట్‌, ఎయిరిండియా విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి. 8.20కి ల్యాండ్‌ కావాల్సిన ఎయిరిండియా విమానం 9గంటలకు చేరింది. 7.20కి ల్యాండ్‌ అవ్వాల్సిన స్పైస్‌ జెట్‌ 9.10కి వచ్చింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

Updated Date - 2021-03-08T09:30:33+05:30 IST