లాక్‌డౌన్ సందర్భంగా కోల్‌కతాకు విమాన సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2020-07-30T18:10:02+05:30 IST

కోల్‌కతా నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు నెలలో వారం రోజుల పాటు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు గురువారం ప్రకటించారు....

లాక్‌డౌన్ సందర్భంగా కోల్‌కతాకు విమాన సర్వీసుల రద్దు

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): కోల్‌కతా నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు నెలలో వారం రోజుల పాటు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు గురువారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏడురోజుల పాటు వారాంతాల్లో మమతాబెనర్జీ సర్కారు లాక్ డౌన్ విధించనుంది. లాక్ డౌన్ విధించే ఆగస్టు 5, 8, 16, 17, 23,24, 31 తేదీల్లో విమానాల రాకపోకలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు విమానాశ్రయ అధికారులు గురువారం ట్వీట్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కోల్ కతా నుంచి ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, నాగపూర్, అహ్మదాబాద్ నగరాలకు జులై 31వతేదీన విమానాల రాకపోకలను రద్దు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 65,258 మందికి కరోనా సోకగా, 1490 మంది మరణించారు. 

Updated Date - 2020-07-30T18:10:02+05:30 IST