Abn logo
Oct 14 2021 @ 08:25AM

chennai: పెరుగుతున్న విమాన ప్రయాణికులు

అడయార్‌(చెన్నై): వరుస సెలవుల కారణంగా తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు దసరా పండుగ కావడంతో అనేక మంది సొంతూళ్ళ బాటపట్టారు. ఈ కారణంగా చెన్నై స్వదేశీ విమానాశ్రయానికి వచ్చి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నెల 14వ తేదీ గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలువులు వచ్చాయి. దీంతో దూరప్రాంత వాసులు తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు విమానమార్గాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా మంగళవారం డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టు నుంచి 190 విమానాలను నడిపారు. ఈ విమానాల్లో 15 వేల మందికిపైగా ప్రయాణించారు. అలాగే, బుధవారం ఈ విమానాల సంఖ్య ను 213కు పెంచారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య 20 వేలు పెరిగింది. ప్రయాణికుల సంఖ్య గురువారం మరింతగా పెరిగే అవకాశం లేక పోలేదు. అలాగే, చెన్నై నుంచి తూత్తుకుడికి చార్జీ రూ.4,500గా ఉండగా, మంగళవారం రూ.6 వేలకు, బుధవారం రూ.7,500లుగా  ఉంది.


ఇవి కూడా చదవండిImage Caption