బురేవి తుపాను నేపథ్యంలో విమానాలు రద్దు

ABN , First Publish Date - 2020-12-03T17:48:23+05:30 IST

చెన్నై: నివర్ తుపాను పోయిందో లేదో బురేవి తుపాను గండం వచ్చి పడింది.

బురేవి తుపాను నేపథ్యంలో విమానాలు రద్దు

చెన్నై: నివర్ తుపాను పోయిందో లేదో బురేవి తుపాను గండం వచ్చి పడింది. కాగా.. బురేవి తుపాను నేపథ్యంలో పలు విమానాలు రద్దు అయ్యాయి. చెన్నై ఎయిర్‌ పోర్టులో 6 విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై నుంచి కొచ్చిన్, తూత్తుకుడి, తిరుచ్చి వెళ్లే విమానాలను అధికారులు రద్దు చేశారు. అలాగే.. కొచ్చిన్, తూత్తుకుడి నుంచి చెన్నై వెళ్లే విమానాలు కూడా రద్దయ్యాయి.


Updated Date - 2020-12-03T17:48:23+05:30 IST