ఫ్లిప్‌కార్ట్‌... భారీ ఆఫర్లు

ABN , First Publish Date - 2021-08-03T01:44:30+05:30 IST

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్‌‘ పేరుతో కొత్త డిస్కౌంట్‌ సేల్‌ను ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌... భారీ ఆఫర్లు

బెంగళూరు : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్‌‘ పేరుతో కొత్త డిస్కౌంట్‌ సేల్‌ను ప్రకటించింది. ఇది ఆగస్టు 5-9 తేదీల్లో ఉంటుంది. ఇందులో... ఆపిల్‌ ‘ఐ’ ఫోన్లు, శాంసంగ్‌, ఒప్పో, వివో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సహా కిచెన్ ఉత్పత్తులకు సంబంధించి భారీ తగ్గింపులు, భారీ ఆఫర్‌లను అందించనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఎప్పటిలాగే, ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశముంటుంది. 

Updated Date - 2021-08-03T01:44:30+05:30 IST