ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 ఆఫర్స్

ABN , First Publish Date - 2021-09-16T02:29:32+05:30 IST

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 ఆఫర్స్

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 పేరుతో కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 ఆఫర్లను ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్స్ 12, ల్యాప్‌టాప్స్‌తోపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్స్ ప్రకటించనుంది. ఐఫోన్ 12 64జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ.66,999 ఉంటుంది. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల క్రెడెట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందించనున్నట్లు తెలిపింది. అయితే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాల తేదీలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు.

Updated Date - 2021-09-16T02:29:32+05:30 IST