Advertisement
Advertisement
Abn logo
Advertisement

Flipkart: బిగ్‌బిలియన్ డేస్ సేల్ డేట్స్ వచ్చేశాయి!

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ తేదీలు వచ్చేశాయి. అక్టోబరు 7న సేల్ ప్రారంభమై 12తో ముగుస్తుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తులపై డీల్స్, రాయితీలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లో బిగ్‌బిలియన్ డేస్ సేల్‌తో పలు డీల్స్, డిస్కౌంట్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది.


తాజాగా, సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా కొనుగోలు దారులకు అదనంగా మరింత రాయితీ లభిస్తుంది. దీంతోపాటు పేటీఎం నుంచి జరిపే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఈ సేల్‌లో భాగంగా ఆరు కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు.. మోటొరోలా, ఒప్పో, పోకో, రియల్‌మి, శాంసంగ్, వివో తమ హ్యాండ్స్‌సెట్స్‌ను విడుదల చేయబోతున్నాయి. 


ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ టీజర్ ప్రకారం.. బోట్ ఉత్పత్తులపై 80 శాతం రాయితీ లభిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లపై 70 శాతం, డిజో ఉత్పత్తులపై 60 శాతం, ఇంటెల్ ల్యాప్‌టాప్‌లపై 40 శాతం రాయితీ లభించనుంది. అలాగే, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వేరబుల్స్, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, ఇతర ప్రొడక్టలపై 80 శాతం తగ్గింపు లభించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే, రిఫ్రిజిరేటర్లపై 70 శాతం రాయితీ లభిస్తుంది. శాంసంగ్, ఒప్పో, వివో, ఐఫోన్ మోడల్స్‌పై పెద్దమొత్తంలో తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement