Abn logo
Oct 29 2020 @ 22:49PM

నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి : ఎమ్మెల్యే రామరాజు

ఏలూరుపాడులో కుళ్లిన వరి పరిశీలిస్తున్న ఎమ్మెల్యేKaakateeya

కాళ్ళ, అక్టోబరు 29: వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు డిమాండ్‌ చేశారు. ఏలూరుపాడులో నీట మునిగి కుళ్లిన వరి చేలను వ్యవసాయ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఇబ్బందులతో వరి సాగు చేపట్టిన రైతులను వర్షం మరింత ముంచేసిందన్నారు. మండలంలో సుమారు 5వేల ఎకరాల్లో వరి పూర్తిగా పాడైందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలన్నారు. అధికారులు పంట నష్టాల వివరాలను పారదర్శకంగా ప్ర భుత్వానికి అందించి ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చేలా చూడాలన్నారు. టీడీపీ నాయకులు వక్కపట్ల హరిబాబు, సుదాబత్తుల వంశీ, చంద్రశేఖర్‌, ఏఈవో మురళీకృష్ణ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement