Abn logo
Sep 28 2021 @ 00:13AM

సదర్‌మాట్‌కు వరద ఉధృతి

ఉధృతంగా ప్రవహిస్తున్న సదర్‌మాట్‌

ఖానాపూర్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 27 : ఖానాపూర్‌ మండలంలోని మేడం పెల్లి సమీపంలో గల సదర్‌మాట్‌  ఆనకట్టకు సోమవారం భారీగా వరద రావటంతో ఉదృతిగా ప్రవహించింది. ఎగువన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుండి గేట్లు ఎత్తటంతో సదర్‌మాట్‌ పొంగి ప్రవహించింది. దీంతో 46935 క్యూసె క్కుల నీరు గోదావరిలోకి వెలుతుందని, లెఫ్‌ కాలువకు 369, రైట్‌ కాలువకు 25 క్యూసెక్కుల నీరు వదిలినట్లు జేఈ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.