ఆయకట్టుకు భరోసా

ABN , First Publish Date - 2021-06-20T05:51:33+05:30 IST

గోదావరి నదిలో పెరిగిన నీటి ప్రవా హం శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకె త్తిస్తోంది. ఈసారి ముందస్తుగా జూన్‌ మూడో వారంలోనే మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి వరదనీరు వస్తోంది.

ఆయకట్టుకు భరోసా
కొత్త నీటితో జలకళను సంతరించుకున్న శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి ముందస్తుగా వచ్చి చేరుతున్న వరద
ఎగువన నిండిన విష్ణుపురి ప్రాజెక్టు
ఇప్పటి వరకు 6.408 టీఎంసీల నీరు చేరిక
ఆనందం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు

ఆర్మూర్‌, జూన్‌ 19: గోదావరి నదిలో పెరిగిన నీటి ప్రవా హం శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకె త్తిస్తోంది. ఈసారి ముందస్తుగా జూన్‌ మూడో వారంలోనే మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి వరదనీరు వస్తోంది. విష్ణుపు రి, బాబ్లీ ప్రాజెక్టుల గేట్లు అప్పుడప్పుడు ఎత్తుతూ దిగువకు నీరు విడుదల చేస్తుండడంతో గోదావరి ప్రవహిస్తోంది. సా ధారణంగా ప్రతీయేటా గోదావరిలోకి మహారాష్ట్ర వరదనీరు జూలై తర్వాతే వస్తుంది. అక్కడి ప్రాజెక్టులు నిండిన తర్వాత నీరు దిగువకు విడుదలవుతుంది. అయితే, ఈసారి విష్ణుపు రి ప్రాజెక్టు ముందుగానే 80శాతం నిండడంతో అప్పుడప్పు డు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి మీద మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టుల్లో జైక్వాడ్‌, మ జల్‌గావ్‌, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులు ప్రధానమైనవి. ఇందు లో జైక్వాడ్‌ ప్రాజెక్టు చాలా పెద్దది. దీని నీటి సామర్థ్యం దా దాపు 100 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు నిండితే శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నిండినట్టే. జైక్వాడ్‌ ప్రాజెక్టు నుంచి విడుదలైన వర ద నీరు శ్రీరామసాగర్‌కు చేరుతుంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తు తం 34శాతం నీరుంది. దీని కింద మజల్‌గావ్‌, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులున్నాయి. ఇవి చిన్న బ్యారేజీలు. విష్ణుపురి నీ టి నిల్వ సామర్థ్యం సుమారు నాలుగైదు టీఎంసీలే. ఈ ప్రా జెక్టు దాదాపు నిండిపోయింది. వరదనీరు ఎక్కువ రాగానే నీటిని కిందకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు ముందస్తుగా నిండడం శుభపరిణామంగా ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి వదిలిన నీరు శ్రీరామసా గర్‌ ప్రాజెక్టులోకి వస్తోంది. శుక్రవారం 16,635 క్యూసెక్కుల నీరు దిగువకు వదలగా.. బాబ్లీ ప్రాజెక్టుకు చేరింది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 10,066 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వ దిలారు. బాబ్లీ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.7టీఎంసీలు. జూ లై ఒకటో తేదీన బాబ్లీగేట్లు ఎత్తుతారు. జూలై ఒకటో తేదీ నుంచి అక్టోబరు 28వ తేదీ వరకు బాబ్లీ గేట్లు ఎత్తి ఉంచాల ని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. జూలై ఒకటో తేదీ నుంచి ఎగువ ప్రాజెక్టు నుంచి వచ్చిన వరద నీరు నేరుగా శ్రీరామసాగర్‌లోకి వస్తుంది. గత రెండు సంవత్సరాలు వరు సగా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నిండింది. యాసంగి సీజన్‌లో పూర్తి ఆయకట్టుకు నీరందించారు. మొదటి దశ 9.68లక్షల ఎకరాలతో పాటు రెండో దశ నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఆ యకట్టుకు కూడా నీరందించారు. అక్టోబరు వరకు భారీగా వర్షాలు కురువడం వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో 90 టీఎం సీలు నీరు నిల్వ ఉండడంతో మొత్తం ఆయకట్టుకు నీరందిం చడం సాధ్యమైంది. యాసంగిలో ఎస్సారెస్పీ మొదటి దశ, రెండో దశతో పాటు లక్ష్మీ, సరస్వతి కాలువలు, ఎత్తిపోతల కింద 13.49లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించారు.
ఈ సీజన్‌లో పునరుజ్జీవం ప్రారంభం
ఈ సీజన్‌లో శ్రీరామసాగర్‌ పునరుజ్జీవ పథకం ప్రారంభ ం కానుంది. దీనికి సంబంధిం చిన పనులు పూర్తయ్యాయి. గోదావరిలో నీటి లభ్యత తగ్గ డం.. ప్రాజెక్టు నిండడం గగ నమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్ర భుత్వం రూ.1069 కోట్లతో పు నరుజ్జీవ పథకాన్ని చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావ రి జలాలను ఎత్తిపోసి వరదకాలువ ద్వారా రివర్స్‌లో శ్రీరా మసాగర్‌ ప్రాజెక్టు లోకి తీసుకురావడం ఈ పథకం ఉద్దేశం. ఇప్పటికే కాళేశ్వరం జలాలను శ్రీరామసాగర్‌ వరదగేట్ల వరకు తీ సుకురావడంతో పథకం సక్సెస్‌ అయినట్టు అయింది. వరద గేట్ల వరకు తెచ్చినా ప్రాజెక్టులోకి ఎత్తిపోయలేదు. నీరు ఎత్తి పోయడానికి అంతా సిద్ధం చేశారు. జగిత్యాల జిల్లాలో రాజే శ్వర్‌రావుపేట్‌, లక్ష్మీపూర్‌ వద్ద పంపుహౌజ్‌లు ఏడాది క్రిత మే పూర్తయ్యాయి. జీరో పాయింట్‌ వద్ద ఎనిమిది మోటా ర్లలో ఆరు మోటార్లు బిగించారు. దాదాపు ఈ పంప్‌హౌజ్‌ కూడా పూర్తయినందున ఎప్పుడైనా కాళేశ్వరం నీళ్లు శ్రీరామసాగర్‌లోకి ఎత్తిపో సే అవకాశముం ది. శ్రీరామసాగర్‌ పునరుజ్జీవ పథ కం చేపట్టిన స మయంలో గోదావ రిలో నీటి లభ్యత కేవలం 54టీఎంసీలు మాత్రమే. కానీ, గత రెం డేళ్లుగా పుష్కలంగా నీరు రా వడంతో నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం 361.85 టీఎంసీలు రాగా, 227.46 టీ ఎంసీలు దిగువకు వదిలారు. రెం డేళ్ల క్రితం కూడా ఇదే స్థాయి లో నీరు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం గోదావరి లో నీరు ముందస్తుగా ప్రవ హించడం.. పునరుజ్జీవ పథ కం పూర్తికావడంతో ఆయక ట్టుకు సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
ఆరు టీఎంసీల నీరు చేరిక
శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి జూన్‌ ఒకటో తేదీ నుంచి 6.408 టీఎంసీల నీరు చేరింది. దాదాపు ఈ మొత్తం నీరు మహారాష్ట్ర నుంచి వచ్చిందే. విష్ణుపురి, బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు వదలడంతో ఎస్సారెస్పీకి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు లో 23.939 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగునీటి ప్రణాళిక తయారీలో అధికారులు నిమగ్నం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌ : శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఆశా జనకంగా వస్తుండడంతో అధికారులు  సాగునీ టి ప్రణాళికను తయారు చేస్తున్నారు. వర్షాలతో వస్తున్న నీ టి ఆధారంగా వానాకాలం సాగుకు నీటి విడుదలపై నిర్ణ యం తీసుకోనున్నారు. ప్రాజెక్టులోకి 50 టీఎంసీల నీరు వ స్తే ఒక పంటకు నీటిని విడుదల చేయనున్నారు. కరీంనగ ర్‌లోని లోయర్‌ మానేరు డ్యాంకు ఎగువన కాకతీయ కాలు వ కింద 5.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదే కాకుం డా లక్ష్మి, సరస్వతి కాలువల కింద 85 వేల ఎకరాల వరకు ఉంది. గుత్ప, అలీసాగర్‌ కింద మరో 80 వేల ఎకరాల ఆ యకట్టు ఉంది. వానకాలంలో అవసరం అయితే ఈ ఆయ కట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. లోయర్‌ మానేరు డ్యాంకు దిగువన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా సాగుకు అందించనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు వస్తున్న వరద వి వరాలను ఏ రోజుకు ఆరోజు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుకు వరద వ స్తోందని డీఈ నరేశ్‌ తెలిపారు. ఈ వరద మరికొన్ని రోజు లు వస్తుందని తెలిపారు. ప్రాజెక్టుకు సగానికిపైగా నీళ్లు వ చ్చిన తర్వాత నీటి విడుదల విషయాన్ని పరిశీలిస్తారని ఆ యన తెలిపారు.

Updated Date - 2021-06-20T05:51:33+05:30 IST