Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద నష్టం అపారం: పల్లె

పుట్టపర్తి, నవంబరు 28: చిత్రావతి వరదలతో రైతకు జరిగిన నష్టం పూడ్చలే నిదంటూ మాజీమంత్రి పల్లె పేర్కొన్నారు. ఆదివారం నగరపంచాయతి పరిదిలోని రా యలవారిపల్లిలో 80 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వరదల్లో మరణించిన వరలక్ష్మి పిల్లలకు 20 వేల ఆర్థికసాయం అందజేశారు. కోతలకు గురైన రైతుల పొలాలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై రైతులు పల్లె వద్ద విలపిం చారు. రైతులను ఆదుకోవాలని, రాయలవారిపల్లి చెక్‌డ్యాంను వెంటనే మరమ్మ తులు చేసి రహదారిని పునరుద్ధరించాలని పల్లె డిమాండు చేశారు. కార్యక్రమంలో కౌన్సిల ర్‌ రత్నప్పచౌదరి, గూడురు ఓబుళేసు, సామకోటి ఆదినారాయణ, కొత్తపల్లి జయప్రకాష్‌, బేకరినాయుడు, డీలర్‌ గోవిందు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement