జూరాలకు కొనసాగుతున్న వరద ఉదృతి

ABN , First Publish Date - 2021-09-13T00:04:41+05:30 IST

ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం 94,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు

జూరాలకు కొనసాగుతున్న వరద ఉదృతి

ధరూరు: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద  ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం 94,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, 16 గేట్ల ద్వారా 64,672 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగించారు. జూరాల జలవిద్యుత్‌ కేంద్రం వద్ద 33,825 క్యూసెక్కులతో నాలుగు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. జూరాల కుడి కాల్వకు 820 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 774 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-13T00:04:41+05:30 IST