Abn logo
Sep 22 2021 @ 19:41PM

సాగర్‌ ప్రాజెక్టుకు తగ్గిన వరద

నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో క్రస్ట్‌ గేట్లను బుధవారం మూసివేశారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.70 అడుగులు (311.1486 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 5,018 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 32,764 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం47,268 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 62,293 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...