సుంకేసుల జలాశయానికి వరద పోటు

ABN , First Publish Date - 2022-07-15T05:49:59+05:30 IST

మండల కేంద్రమైన రాజోలి శివారులోని సుంకేసుల డ్యాంకు వరద పోటెత్తింది.

సుంకేసుల జలాశయానికి వరద పోటు
డ్యామ్‌ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

- 10 గేట్ల ద్వారా నీటి విడుదల

రాజోలి, జులై 14 : మండల కేంద్రమైన రాజోలి శివారులోని సుంకేసుల డ్యాంకు వరద పోటెత్తింది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి మంగళవారం విడుదల చేసిన వరద నీరు గురువారం సుంకేసుల జలాశయానికి చేరాయి. దీంతో డ్యాం 10 గేట్లు తెరిచి నీటి విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం 16,500 క్యూసెక్కుల నీరు రావడంతో నాలుగు గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో పెరిగి 37,961 క్యూసెక్కులకు చేరడంతో 10 గేట్లు ఎత్తి, 37,630 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం గరిష్ట నీటి సామర్థ్యం 0.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.554 టీఎంసీ నీరు ఉందని జేఈ రాజు తెలిపారు. గరిష్ట నీటిమట్టం 292.00కు గాను, ప్రస్తుతం 290.00 నీటిమట్టం నమోదైనట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


Updated Date - 2022-07-15T05:49:59+05:30 IST