ముంపు బాధితులకు ఒకేసారి పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-07-29T07:15:28+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపు రం రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న భూములకు ఎకరానికి రూ.15.60లక్షల చొప్పున ఒకేసారి పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని భువనగిరి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసితులు కలెక్టర్‌ పమేలాసత్పతిని బుధవారం కలిసి కోరారు.

ముంపు బాధితులకు ఒకేసారి పరిహారం చెల్లించాలి
కలెక్టర్‌ పమేలాసత్పతికి జ్థాపికను అందజేస్తున్న బస్వాపురం గ్రామస్థులు

భువనగిరి రూరల్‌, జూలై 28 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపు రం రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న భూములకు ఎకరానికి రూ.15.60లక్షల చొప్పున ఒకేసారి పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని భువనగిరి పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసితులు కలెక్టర్‌ పమేలాసత్పతిని బుధవారం కలిసి కోరారు. ఎకరానికి రూ.15.60లక్షల పరిహారం చెల్లించాల్సి ఉండగా జనరల్‌ అవార్డు ద్వారా ఎకరానికి రూ.12.30లక్షలు చెల్లించేలా రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. అందరికి అందుబాటులో ఉండేలా పునరావాసం కల్పించాలన్నారు.  ముందుగా ఆమెకు మెమోంటో అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఎం పీటీసీ ఉడుత శారద, ఉపసర్పంచ్‌ ఎడ్ల దర్శన్‌రెడ్డి, నాయకులు మొర నర్సిరెడ్డి, డొంకెన ప్రభాకర్‌, పరమేష్‌, ఎన్‌.బాలయ్య, శ్రీశైలం ఉన్నారు. 

చందుపట్ల జీపీ నిధుల దుర్వినియోగంపై విచారణ 

భువనగిరి రూరల్‌ : భువనగిరి మండలం చందుపట్ల సర్పంచ్‌ చిన్నం పాండు, ఉపసర్పంచ్‌ పిట్టల కళ్యాణి, పంచాయతీ కార్యదర్శి విజయశాంతి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని వచ్చిన ఫిర్యాదుల మేరకు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ బుధవారం విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యుల సమక్షంలో నిధుల వినియోగంలో జరిగిన అక్రమాలపై ఇరువర్గాల సమక్షంలో విచారణ నిర్వహించారు. అనంతరం జీపీ నిధులతో చేపట్టిన పనులను గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. విచారణకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు సమర్పించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 



Updated Date - 2021-07-29T07:15:28+05:30 IST