సాగర్‌ జలాశయానికి తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-11-04T02:37:41+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గటంతో అన్నీ క్రస్ట్‌గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం

సాగర్‌ జలాశయానికి తగ్గిన వరద

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గటంతో అన్నీ క్రస్ట్‌గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు), ప్రస్తుతం 589.70 అడుగులు(311.1486టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ ప్రాజెక్టు నుంచి మొత్తం 49,176 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 62,189 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885అడుగుల (215.8070టీఎంసీలు) కాగా ప్రస్తుతం 869అడుగులు (137.5940టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 4,379 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Updated Date - 2021-11-04T02:37:41+05:30 IST