కుండపోత వాన.. పొంగుతున్న నదులు

ABN , First Publish Date - 2020-08-11T08:24:04+05:30 IST

పలు రాష్ట్రాల్లో కుం డపోతగా వాన కురుస్తోంది. వరదలు ముం చెత్తుతున్నాయి. నదులు ప్రమాకర స్థాయిని మించి ఉరకలు పెడుతున్నాయి. లోతట్టు ప్ర దేశాలు నీటమునుగుతున్నాయి...

కుండపోత వాన..  పొంగుతున్న నదులు

  • మహారాష్ట్రలో 49శాతం నిండిన రిజర్వాయర్లు
  • యూపీలో 19 జిల్లాలు వరదల్లో..
  • 49కి పెరిగిన కేరళ విషాద మృతులు


న్యూఢిల్లీ, ఆగస్టు 10: పలు రాష్ట్రాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. వరదలు ముం చెత్తుతున్నాయి. నదులు ప్రమాకర స్థాయిని మించి ఉరకలు పెడుతున్నాయి. లోతట్టు ప్ర దేశాలు నీటమునుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 20జిల్లాలో 500పైగా గ్రామాలు వరదలతోఅల్లాడుతున్నాయి. గంగా, రాప్టి, శారదా, గండక్‌ నదులు పొంగిపొర్లుతున్నాయి. అ జాంఘర్‌, మావు, గోండా పరివాహక ప్రాం తాలు బాగా దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ 49శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి అది 57శాతంగా ఉంది. ముంబై, పాల్‌ఘర్‌, థానే, రాయ్‌గడ్‌, రత్నగిరి, సింధూదుర్గ్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు కొనసాగుతున్నాయి. కర్నాటకలో 12జిల్లాలు, 885 గ్రామాలు కంభవృష్టిలో చిక్కుకున్నాయి.


మల్నాడ్‌తోపాటు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ గా ఉంది. ఇప్పటి వరకూ 12మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేరళలోని తేయాకు తోటల్లో సంభవించిన ప్రమాదంలో మరో ఆరు మృతదేహాలను వెలకితీశారు. దీంతో మృతుల సంఖ్య 49కి చేరింది. అళప్పుజ, కొట్టా యం, ఎర్నాకుళం, ఇడుక్కి, వాయనాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌ జిల్లాల్లో ప్రకటించిన రెడ్‌ అలర్ట్‌ను భారత వాతావరణ శాఖ కొనసాగిస్తోంది. ముళ్లపెరియార్‌ డ్యాంలో వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది. వానల వల్ల కొట్టాయంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కాగా.. భారీ వర్షాలు పడొచ్చనే అంచనాతో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, హరియాణా, చండీగఢ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.


వరదలను సమష్టిగా ఎదుర్కొందాం: మోదీ

మరింత సమర్థవంతంగా వరదలను అంచనా వేసేందుకు వరదల అంచనా, హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరుస్తూ సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇన్నోవేటివ్‌ టెక్నాలజీలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో వరదల పరిస్థితిని సమీక్షించడంలో భాగంగా ప్రధాని ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అసోం, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులు, కర్ణాటక మంత్రులతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆరోగ ్య శాఖ మంత్రి హర్ష్‌వర్ధన్‌, హోం శాఖ సహాయ మంత్రులు నిత్యానంద్‌ రాయ్‌, జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.  సమావేశంలో మోదీ మాట్లాడుతూ ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థల్లో మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2020-08-11T08:24:04+05:30 IST