పుష్ప విలాపం

ABN , First Publish Date - 2021-05-10T05:57:45+05:30 IST

కర్ణాటకలో కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం... ఆంధ్రలో కర్ఫ్యూ ప్రభావం వెరసి పూల ధరలు అమాంతం పడిపోయాయి. మే నెలలో శుభకార్యాలు ఉన్నా... ఆంక్షల మధ్య ఆర్భాటం లేకుండా జరుగుతున్నాయి. దీంతో శుభకా ర్యాలకు పూలు కొనేవారు లేక కుప్పలుకుప్పలుగా మిగిలిపోతున్నాయి.

పుష్ప విలాపం
మదనపల్లె-సీటీఎం రోడ్డు పక్కన రైతులు పారబోసిన బంతిపూలు

అమాంతం పడిపోయిన పూలధరలు 


రోడ్డు పక్కన పారబోస్తున్న  రైతులు


మదనపల్లె టౌన్‌, మే 9: కర్ణాటకలో కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం... ఆంధ్రలో కర్ఫ్యూ ప్రభావం వెరసి పూల ధరలు అమాంతం పడిపోయాయి. మే నెలలో శుభకార్యాలు ఉన్నా... ఆంక్షల మధ్య ఆర్భాటం లేకుండా జరుగుతున్నాయి. దీంతో శుభకా ర్యాలకు పూలు కొనేవారు లేక కుప్పలుకుప్పలుగా మిగిలిపోతున్నాయి. కనీసం రైతులకు కోతకూలి, రవాణా ఖర్చులు కూడా దక్కక పోవడంతో పూలను రోడ్డు పక్కన పడేస్తున్నారు. జిల్లాలోని పడమటి మండలాల్లో  రైతులు సన్నజాజులు, బంతిపూలు, కనకాంబరాలు, గుండుమల్లె లను  సుమారు 100 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మే, జూన్‌, జూలై నెల ల్లో శుభకార్యాలు ఉంటాయని, తాము సాగుచేసిన పూలకు మంచి ధరలు వస్తాయన్న రైతుల ఆశలపై కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకొట్టింది. గత నెల మొదటివారంలో రోజా పూలు కిలో రూ.200, సన్న జాజులు రూ.200, బంతిపూలు రూ.60, కనకాంబ రాలు రూ.170, గుండుమల్లెలు రూ.150 దాకా హోల్‌సేల్‌ ధరలు పలికాయి. చాలా మంది రైతులు పండించిన పూలను మదన పల్లె పట్టణం బెంగళూరు బ స్టాండులోని హోల్‌సేల్‌ మండీ ల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి బెంగళూరు, విజయ వాడ, హైదరాబాద్‌కు ఎగు మతి చేసేవారు. కానీ రెండు వారాలుగా కర్ణాటకలో లాక్‌ డౌన్‌ ప్రకటించడం, ఆంధ్రలో 3వ తేదీ నుంచి అర్ధరోజు కర్ఫ్యూ విధించారు. దీంతో చాలామటుకు శుభకార్యాలు కేవలం 20 మందిలోపు ఆర్భాటం లేకుండా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో పూలకు డిమాండ్‌ పూర్తిగా తగ్గిపోయింది. సగానికి సగం ధరలు పడిపోయి రైతులకు కోతకూలి చేతికి రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రోజాపూలు కిలో రూ.100, సన్నజాజులు రూ.120, బంతిపూలు రూ.30, కనకాంబరాలు రూ.70, గుండుమల్లెలు కిలో రూ.70 మాత్రమే ధరలు పలుకుతున్నాయి. కాగా తోటల్లో సన్నజాజులు కోసేందుకు కిలోకు కూలి రూ.100 చెల్లించాలి, అలా గే బంతిపూలకు రూ.20, కనకాంబరాలకు రూ.90, గుండుమల్లెలకు రూ.70 చొప్పున అవుతోంది. మార్కె ట్‌ల్లో ధరలు చూస్తే కోతకూలి కూడా చేతికి రావడం లేదు. చాలా మంది తోటల్లో పూలను వదిలేయలేక, కోసి ఊర్లలో పంచేస్తున్నారు. మరికొందరు బంతిపూలను కోసి రోడ్డుపక్కన పడేస్తున్నారు.

Updated Date - 2021-05-10T05:57:45+05:30 IST