క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి.. కటకటాలపాలైన ఫ్లోరిడా జంట!

ABN , First Publish Date - 2020-08-02T00:42:52+05:30 IST

క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి ఓ జంట.. కటకటాలపాలైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన జోస్ ఆంటోనియో

క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి.. కటకటాలపాలైన ఫ్లోరిడా జంట!

ఫ్లోరిడా: క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించి ఓ జంట.. కటకటాలపాలైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన జోస్ ఆంటోనియో ఫ్రీర్ ఇంటీరియన్(24), యోహానా అనాహి గొంజాలెజ్ దంపతులు కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. మహమ్మారి బారినపడినప్పటికీ.. కరోనా లక్షణాలు లేకపోవడంతో హోం క్వారెంటైన్‌లో ఉండాలని వారికి అధికారులు సూచించారు. అయితే ఆ దంపతులు అధికారుల ఆదేశాలను లెక్కచేయలేదు. నిబంధనలు ఉల్లఘించి.. పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లడంతోపాటు, నిత్యవసర సరుకుల కోసం స్టోర్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. ఆదేశాలు ఉల్లఘించి.. వాళ్లు యథేచ్ఛగా బయట తిరిగే సమయంలో స్థానికులు పోలీసుకుల సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు.. జోస్ ఆంటోనియో, మోహానా అనాహిలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం ఆ దంపతులు వెయ్యి డాలర్ల బాండ్‌ను సమర్పించి.. జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడా ఇప్పటి వరకు 4.70లక్షల మంది కరోనా బారిన పడ్డారు. సుమారు 6వేల మందిపైగా కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-08-02T00:42:52+05:30 IST