ఆ తప్పును మీరూ చేయకండి.. ప్రజలకు కొవిడ్ బాధితుడి విన్నపం!

ABN , First Publish Date - 2021-01-07T17:23:34+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది బలిగొంది. అయినప్పటికీ కొంత మంది ఈ మహమ్మారిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించడ

ఆ తప్పును మీరూ చేయకండి.. ప్రజలకు కొవిడ్ బాధితుడి విన్నపం!

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది బలిగొంది. అయినప్పటికీ కొంత మంది ఈ మహమ్మారిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించడకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ వ్యక్తి తాజాగా కొవిడ్ బారినపడ్డాడు. ఆసుపత్రి బెడ్‌పై నుంచి ఆయన ఇచ్చిన వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన 50 ఏళ్ల చక్ స్టాసే కరోనా వైరస్‌ను ఈజీగా తీసుకున్నారు. నిబంధనలు పాటించడంలో అలసత్వం వహించారు. 



ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకింది. కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. తాను చేసిన తప్పు మరేవరూ చేయొద్దని ప్రజలను వేడుకుంటుూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘కరోనా వైరస్‌ను నేను కేవలం ఫ్లూ మాదిరిగానే చూశాను. క్రమంగా అది కనుమరుగవుతుందని భావించా. మాస్క్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదనుకుని భ్రమపడ్డాను. ప్రస్తుతం నేను మహమ్మారి బారినపడ్డాను. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. నేను చేసిన పొరపాటును మీరు చేయకండి. దయచేసి అందరూ మాస్క్ ధరించండి’ అని పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలో ఇప్పటి వరకు దాదాపు 14లక్షల మంది కొవిడ్ బారినపడగా.. ఇందులో 22వేలకు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-01-07T17:23:34+05:30 IST