ఫ్లోరిడాలో దారుణం.. మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉబెర్ డ్రైవర్‌ను..

ABN , First Publish Date - 2020-10-30T01:35:23+05:30 IST

ఫేస్‌మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉబెర్ డ్రైవర్‌ పట్ల ఫ్లోరిడాలో ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. డ్రైవర్‌పై సదరు వ్యక్తి పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

ఫ్లోరిడాలో దారుణం.. మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉబెర్ డ్రైవర్‌ను..

ఫ్లోరిడా: ఫేస్‌మాస్క్ పెట్టుకోమన్నందుకు ఉబెర్ డ్రైవర్‌ పట్ల ఫ్లోరిడాలో ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. డ్రైవర్‌పై సదరు వ్యక్తి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... క్రిస్టోఫర్ వచా(30) అనే వ్యక్తి మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో తాంపాలోని ట్రేజర్‌ల్యాండ్ వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేశాడు. దీంతో అతను చెప్పిన చోటుకు ఓ క్యాబ్ వచ్చింది. ఆ సమయంలో క్రిస్టోఫర్ ముఖానికి మాస్క్ ధరించకుండా క్యాబ్ ఎక్కేందుకు రెడీ అయ్యాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ రేమండ్ జాక్సన్(62) ఫేస్‌మాస్క్ ధరించిన తర్వాత క్యాబ్ ఎక్కాలని సూచించాడు. అంతే... ఆ మాట విన్న క్రిస్టోఫర్ ఒక్కసారిగా డ్రైవర్‌పై విరుచుకుపడ్డాడు. కారు నుంచి బయటకు లాగి ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. డ్రైవర్ తలను కారుకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్రిస్టోఫర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.  


Updated Date - 2020-10-30T01:35:23+05:30 IST