తల్లి చేసిన పనికి ప్రమాదంలో పడ్డ 2 నెలల పసికందు.. బిడ్డను ఆడించే క్రమంలో ఇలా పైకెత్తి..

ABN , First Publish Date - 2021-11-20T03:00:15+05:30 IST

తల్లి తనకు తెలీకుండానే చేసిన పనికి.. ప్రమాదంలో పడ్డ పసికందు..

తల్లి చేసిన పనికి ప్రమాదంలో పడ్డ 2 నెలల పసికందు.. బిడ్డను ఆడించే క్రమంలో ఇలా పైకెత్తి..

ఇంటర్నెట్ డెస్క్: పసి పిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారు. వారితో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అమెరికాలో జరిగిన ఓ షాకింగ్ ఘటనే ఇందుకు ఉదాహరణ. ఫ్లోరిడా రాష్ట్రం వోలూసియా కౌంటీకి చెందిన ఎమిలీ పిచ్చిన్నీ గురువారం  తన రెండు నెలల పాప ఫిట్స్ వచ్చినట్టు ఊగిపోవడాన్ని చూసి కంగారు పడిపోయింది. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించింది. ఆమె ఇంటికి చేరుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది.. పాపను ఆస్పత్రికి తరలించారు. 


అయితే.. వైద్య పరీక్షల సందర్భంగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. షేకింగ్ బేబీ సిండ్రోమ్ కారణంగా ఆ పసికందు పుర్రెలో పగుళ్లు ఏర్పడ్డాయని, మెదడు దెబ్బతిందని వైద్యులు చెప్పారు. బిడ్డను ఆడించే క్రమంలో పైకెత్తి అతిగా ఊపితే ఇలా జరుగుతుందని చెప్పారు. దీంతో.. పోలీసులు ఎమీలీని అరెస్టు చేసి.. మిలియన్ డాలర్ల బాండుపై విడిచిపెట్టారు. పాప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Updated Date - 2021-11-20T03:00:15+05:30 IST