ఫ్లోరిడాపై మళ్లీ పంజా విసురుతున్న కరోనా!

ABN , First Publish Date - 2021-08-03T13:11:54+05:30 IST

డెల్టా వేరియంట్‌ విజృంభణతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్‌ ఉధృతి పెరుగుతోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 10,207 మంది కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరారు.

ఫ్లోరిడాపై మళ్లీ పంజా విసురుతున్న కరోనా!

ఫ్లోరిడా ఒక్కరోజే 10,207 మంది ఆస్పత్రికి..

ఓర్లాండో, ఆగస్టు2: డెల్టా వేరియంట్‌ విజృంభణతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్‌ ఉధృతి పెరుగుతోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 10,207 మంది కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరారు. 2020 జూలై 23న అత్యధికంగా 10,170 మంది కరోనాతో ఆస్పత్రి పాలవగా, సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో చేరికలు జరగడం కొత్త వేరియంట్ల వేగానికి అద్దం పడుతోంది.


డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండటం, ఇంకా భారీ సంఖ్యలో ప్రజలు టీకాకు దూరంగా ఉండటం దీనికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో రోజువారీ కొత్త కొవిడ్‌ కేసులు జూలై 16న 30,887 ఉండగా, జూలై 30 కల్లా 77,827కు పెరిగాయి. టీకాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా వ్యాక్సిన్ల ఊసులేని ఏడాది కిందటి స్థాయిలో వైరస్‌ మళ్లీ వేళ్లూనుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-08-03T13:11:54+05:30 IST