విమానంలో యువతి హల్‌చల్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!

ABN , First Publish Date - 2021-07-14T01:46:50+05:30 IST

విమానంలో హల్‌చల్ చేసిన యువతిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

విమానంలో యువతి హల్‌చల్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!

ఫ్లోరిడా: విమానంలో హల్‌చల్ చేసిన యువతిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. విమానంలో మాస్క్ ధరించకపోవడంతో పాటు తోటి ప్రయాణికులపై ఉమ్మి వేయడంతో సదరు యువతిని విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఫ్లోరిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో గత బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అడిలైడ్ ష్రోవాంగ్(23) అనే యువతి ముఖానికి మాస్క్ వేసుకోకుండా విమానం ఎక్కింది. దాంతో విమాన సిబ్బంది ఆమెను మాస్క్ ధరించాల్సిందిగా కోరారు. ఎన్నిసార్లు చెప్పిన.. వారి మాటలను బేఖాతరు చేసింది ష్రోవాంగ్. దీంతో చేసేదేమిలేక సిబ్బంది ఆమెను విమానం నుంచి కిందకు దిగిపోవాలని చెప్పారు. దానికి ష్రోవాంగ్ ససేమీరా చెప్పడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆమె నిర్వాకానికి తోటి ప్రయాణికులు కూడా కోపగించుకోవడం చూసిన ష్రోవాంగ్ వారిపై ఉమ్మి వేసింది. పోలీసులు వచ్చే వరకు కూడా విమాన సిబ్బందితో వాగ్వాదం చేస్తూనే ఉందామె. మొదట పోలీసులకు కూడా ప్రతి ఘటించింది ష్రోవాంగ్. దాంతో పోలీసులు ఆమెను అదులోకి తీసుకుని బలవంతంగా విమానం నుంచి కిందకు దించారు. చేతులకు బేడీలు వేసి, స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-14T01:46:50+05:30 IST