సైకిల్‌పై యువ‌తి స‌వారీ... ఎదురైన‌ రెండు భారీ మొస‌ళ్ల‌ను చూసి...

ABN , First Publish Date - 2021-05-01T13:23:32+05:30 IST

ఒక‌వేళ మీరు ఆనందంగా సైకిల్ తొక్కుకుంటూ...

సైకిల్‌పై యువ‌తి స‌వారీ... ఎదురైన‌ రెండు భారీ మొస‌ళ్ల‌ను చూసి...

వాషింగ్ట‌న్: ఒక‌వేళ మీరు ఆనందంగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న‌ప్పుడు ఎద‌రుగా రెండు భారీ మొస‌ళ్లు వ‌స్తే ఏం చేస్తారు? భ‌య‌ప‌డి సైకిల్ అక్క‌డే వ‌దిలేసి పారిపోతారేమో.... ఇటువంటి ఘ‌ట‌నే అమెరికాలోని ఒక యువ‌తికి ఎదుర‌య్యింది. ఆ భారీ మొస‌ళ్లను చూసిన ఆమె అక్క‌డే నిలుచుండిపోయింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 


 ఫ్లోరిడాకు చెందిన‌ స్టెల్జ‌ర్ సైకిల్‌పై అభ‌యార‌ణ్యంలో ప్రయాణిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె వీడియో కూడా తీస్తోంది. ఈ స‌మ‌యంలో ఆమెకు రెండు భారీ మొస‌ళ్లు ఎదుర‌య్యాయి. ఆమె వాటిని గ‌మ‌నిస్తూ అక్కడే ఆగిపోయింది. ఒక మొస‌లి రోడ్డుకు అడ్డంగా ఉండ‌గా, మ‌రో మొస‌లి రోడ్డు ప‌క్కగా ఉంది. ఆమె చూస్తుండగానే రోడ్డుమీద నున్న మొసలి ఆ ప‌క్క‌నే ఉన్న న‌దిలోకి వెళ్లిపోయింది. ఈ సంద‌ర్భంగా స్టెల్జ‌ర్ మాట్లాడుతూ తాను సైకిల్ మీద వెళుతుండ‌గా, భారీ మొస‌ళ్లు ఎదుయ్యేస‌రికి భ‌య‌ప‌డిపోయాన‌ని, అయితే అక్క‌డే ఉండి, వాటి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించాన‌ని తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.                             

                                   వైర‌ల్ హ‌గ్ సౌజ‌న్యంతో....

Updated Date - 2021-05-01T13:23:32+05:30 IST