దాగుడు మూతలాడిన లవర్స్.. ప్రియుడ్ని సూట్‌కేస్‌లో వేసి మరిచిపోవడంతో..

ABN , First Publish Date - 2020-02-26T23:06:42+05:30 IST

ప్రియుడిని సూట్‌కేస్‌లో వేసి ఊపిరాడకుండా చేసి చంపేసిన ప్రేయసిని మంగళవారం ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

దాగుడు మూతలాడిన లవర్స్.. ప్రియుడ్ని సూట్‌కేస్‌లో వేసి మరిచిపోవడంతో..

ఫ్లోరిడా: ప్రియుడిని సూట్‌కేస్‌లో వేసి ఊపిరాడకుండా చేసి చంపేసిన ప్రేయసిని మంగళవారం ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే... పూటుగా మద్యం సేవించిన జార్జ్ టోర్రెజ్, సారా బూన్ అనే ప్రేమికులు సరదాగా దాగుడు మూతలు ఆట ఆడారు. ఈ క్రమంలో ప్రియుడు జార్జ్‌ను సారా ఒక సూట్‌కేస్‌లో వేసి ప్యాక్ చేసింది. తాగిన మైకంలో ఉన్న ఆమె ప్రేమికుడిని సూట్‌కేస్‌లో వేసిన విషయం మరిచిపోయి వెళ్లి నిద్రపోయింది.


కొద్దిసేపటి తర్వాత సారా మొబైల్ రింగ్ కావడంతో ఆమెకు మెలకువ వచ్చింది. అప్పుడు ఇంట్లో జార్జ్ కనిపించకపోవడంతో.. ఆమెకు అసలు విషయం గుర్తుకొచ్చింది. వెంటనే బ్రీఫ్‌కేస్ వద్దకు పరుగులు తీసింది. బ్రీఫ్‌కేస్ ఓపెన్ చేసి చూసిన ఆమెకు లోపల జార్జ్ అచేతనంగా పడి ఉండడం కనిపించాడు. దాంతో వెంటనే 911కు ఫోన్ చేసింది. ఆమె సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు జార్జ్ మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో సారాను విచారించిన పోలీసులకు ఆమె అసలు విషయం చెప్పింది.


మద్యం మత్తులో తాము దాగుడు మూతలు ఆడామని.. ఈ క్రమంలో జార్జ్‌ను ఒక సూట్‌కేస్‌లో వేసి ప్యాక్ చేసిన విషయం మరిచిపోయి నిద్రపోయానని.. కొంత సేపటి తర్వాత మెలకువ వచ్చి వెళ్లి చూస్తే లోపల అతను నిర్జీవంగా కనిపించాడని చెప్పింది. దీంతో ప్రియుడి మృతికి కారణమైన సారాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 

Updated Date - 2020-02-26T23:06:42+05:30 IST