ఫ్లోరిడాలో 11 వేలు దాటిన మరణాల సంఖ్య

ABN , First Publish Date - 2020-08-30T05:09:00+05:30 IST

ఫ్లోరిడాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శనివారం 11 వేలు దాటింది.

ఫ్లోరిడాలో 11 వేలు దాటిన మరణాల సంఖ్య

ఆర్లాండో: ఫ్లోరిడాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శనివారం 11 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో కరోనా కారణంగా 148 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 11,105కు చేరుకుంది. సోమవారం నుంచి ఇప్పటివరకు ఫ్లోరిడాలో మరణాల సంఖ్య 183 కంటే తక్కువగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 3,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,19,003కు చేరుకుంది. గత కొద్ది రోజుల నుంచి ఫ్లోరిడాలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. జూలై 12న ఫ్లోరిడాలో ఒకే రోజు 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని ఒక రాష్ట్రంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం అదే మొదటిసారి. ఇక ప్రభుత్వం ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకుంటూ రావడంతో.. కేసుల సంఖ్యలో మార్పు కనపడుతూ వచ్చింది. కాగా.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 61,18,586 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 1,86,532 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-08-30T05:09:00+05:30 IST