Abn logo
Sep 23 2020 @ 00:00AM

చెవిలో పువ్వు

Kaakateeya

‘ట్రెండ్‌ని ఫాలో అవ్వను... సెట్‌ చేస్తా’... ఓ సినిమాలో పాపులర్‌ డైలాగ్‌. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ కూడా అదే దారిలో వెళుతున్నట్టున్నాడు. ఎవరో మొదలుపెట్టిన ట్రెండ్‌ను అనుసరించడం కాదు... ఆ ట్రెండ్‌ సెట్టర్‌ మనమే కావాలన్నది అతడి ఆలోచన!

స్టార్‌ హీరో రణవీర్‌సింగ్‌తో పోటీపడేటంతగా కాదు కానీ... డ్రెస్సింగ్‌లో తనకంటూ ఓ ఎట్రాక్షన్‌ ఉండేలా చూసుకొంటాడు విక్కీ. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి... కథానాయకుడిగా ఎదిగిన విక్కీ... తాజాగా హెయిర్‌ స్టయిల్‌ మార్చాడు. ఎప్పుడూ నిండైన జుత్తుతో కనిపించే ఈ నటుడు... ఇప్పుడిలా అరగుండుతో అలరిస్తున్నాడు.

అన్నింటి కన్నా అభిమానులను బాగా ఆకట్టుకొంటున్నది అతడి హెయర్‌ కట్‌లో పువ్వు ఆకారం. చెవిపైన చెక్కించిన ఈ పుష్పం కుర్రకారును కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్‌ చేశాడు విక్కీ. క్షణాల్లో లైక్‌లు లక్షలు దాటాయి. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.. 


Advertisement
Advertisement
Advertisement