Jul 30 2021 @ 05:59AM

వేణు రీ ఎంట్రీ

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘రామారావు ఆన్‌డ్యూటీ’ చిత్రంతో నటుడు వేణు సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ నిర్మాతలు గురువారం ట్విట్టర్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 1999లో వచ్చిన ‘స్వయంవరం’ చిత్రంతో వేణు హీరోగా పరిచయమయ్యారు. ‘గోపి గోపిక గోదావరి’ హీరోగా ఆయన చివరి చిత్రం. జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దమ్ము’లోనూ కీలకపాత్రలో కనిపించారు. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్‌, రాజేష్‌ విజయన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.