ఆ దుకాణంలో ఎగిరే వడా పావ్... వీడియో వైరల్!

ABN , First Publish Date - 2021-03-29T15:42:08+05:30 IST

పాకశాస్త్ర నిపుణులు వంటలను విచిత్ర రీతులలో...

ఆ దుకాణంలో ఎగిరే వడా పావ్... వీడియో వైరల్!

ముంబై: పాకశాస్త్ర నిపుణులు వంటలను విచిత్ర రీతులలో తయారు చేయడం మనం చూసేవుంటాం. ఇదేకోవలో తాజాగా ముంబైకి చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకునికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఇష్టపడుతున్నారు. 


మనం  ఫ్లయింగ్ దోశ, రజినీకాంత్ దోశల గురించి వినే ఉంటాం. అయితే ఫ్లయింగ్ వడా పావ్ గురించి ఎప్పుడూ వినివుండం. వీడియోలో కనిపిస్తున్న స్ట్రీట్ ఫుడ్ నిపుణుడు వడా పావ్‌ను గాలిలోకి ఎగురవేస్తూ, దానిని మరో పాత్రలోకి అమరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ పాకశాస్త్ర ప్రవీణుని పేరు రఘు. ఈ వీడియోలో రఘు... దోశ చేసే విధానం కూడా చూడవచ్చు.

                                      ‘ఆచీ ముంబై’ సౌజన్యంతో....

Updated Date - 2021-03-29T15:42:08+05:30 IST