Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 20:26PM

వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలి: కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి వనరులు పెరిగాయని, రైతులు వాణిజ్య పంటలవైపు దృష్టిసారించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధుల బృందంతో మంత్రి  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సిరిసిల్లలో ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మలేషియాలో పర్యటించనున్నామని, ఆయిల్‌పాం సాగుపై అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. సిరిసిల్లతోపాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఆయిల్‌ ఫ్యాక్టరీలు పెట్టేందుకు ముందుకొచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. సిరిసిల్లలో ఫ్యాక్టరీతోపాటు సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌, ఆయిల్‌పాం నర్సరీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ ఆయిల్‌పాం పంటకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, వేలాది మందికి ఆయిల్‌పాం ఫ్యాక్టరీల్లో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్‌కు సంబంధించి మలేషియాలో తమ కంపెనీ చేస్తున్న సాగు, ప్రాసెసింగ్‌ వంటి అంశాలను అధ్యయనం చేయడానికి రావాలని కేటీఆర్ ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement