అన్ని పంటలపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-02-25T03:56:28+05:30 IST

మానవాళికి ఉపయోగపడే అన్ని రకాల పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ము ఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి అన్నారు.

అన్ని పంటలపై దృష్టి సారించాలి
శ్రీగంధం మొక్కను పరిశీలిస్తున్న ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి

- వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి

పర్వతాయిపల్లి(తాడూరు), ఫిబ్రవరి 24 : మానవాళికి ఉపయోగపడే అన్ని రకాల పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ము ఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పర్వతా యిప ల్లి గ్రామంలో గోవర్ధన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి అనే రైతులు 13ఎకరాలల్లో పెంచుతున్న శ్రీగంధం మొక్కలను పరిశీలించేందుకు వచ్చారు. శ్రీగంధం మొక్కలతోపాటు అంతర్‌పంటగా జామ, సర్వీ మొక్కలను పెంచుతుండడంతో ఆ రైతులను వ్య వసాయ శాఖ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేయడం వల్ల అవసరమైన నూనె, పప్పు దినుసులు అధికమొత్తంలో దిగుమతులు చేసుకోవాల్సి వస్తుందన్నారు.  ప్రస్తుత పరిస్థితు లకనుగుణంగా రైతులు పంటలు సాగు చేసే విధానంలో నూతన ఒరవడు ల ను అందిపుచ్చుకోవాలన్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఎర్రచందనం, శ్రీగం ధం, ఆయిల్‌ఫామ్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం అందిస్తు న్న సబ్సిడీలను అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధిం చేలా ప్రతీ రైతు నడుం బిగించా లన్నారు. రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి వెంకట్‌రాం రెడ్డి మాట్లాడుతూ కూరగాయలు, పండ్ల తోటల పెంపకాలపై ఆధునికతను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం మేడి పూర్‌గ్రామంలో పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పా మ్‌ తోటలను పరిశీలించారు. ఆయిల్‌ పామ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖాధికారులతో సూచనలు తీసుకొని తక్కువ ఖర్చు తో ఎక్కువ దిగుబడి పొందేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో  వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ రావు, ఏడీ, ఏవోతోపాటు గ్రామ సర్పంచ్‌ బాల్‌రెడ్డి, రైతులు ఉన్నారు.

Updated Date - 2021-02-25T03:56:28+05:30 IST