డెంగ్యూ నియంత్రణపై దృష్టిసారించండి: అజయ్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-08-26T00:54:02+05:30 IST

జిల్లాలో డెంగ్యూ నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు.

డెంగ్యూ నియంత్రణపై దృష్టిసారించండి: అజయ్‌కుమార్‌

ఖమ్మం: జిల్లాలో డెంగ్యూ నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నందున దోమలను లార్వాదశలో అరికట్టే చర్యలు తీసుకోవాలని, దోమలు అధికంగా వ్యాప్తి చెందే ప్రదేశాలను గుర్తించి స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టాని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సకాలంలో చేపట్టాలని సూచించారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీలనుంచి రక్తనామూనాలు సేకరించి డయాగ్నస్టిక్‌ హబ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని అజయ్‌కుమార్‌ ఆదేశించారు.

Updated Date - 2021-08-26T00:54:02+05:30 IST