Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆన్‌లైన్‌ పేకాట గ్రూపులపై దృష్టి పెట్టాలి

డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి

 కరీంనగర్‌ క్రైం, నవంబరు 30: ఆన్‌లైన్‌ పేకాట గ్రూపులపై దృష్టి పెట్టాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌కమిషనర్‌లు, జిల్లాల పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం డీజీపీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోకార్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలను ప్రజల సేవలకు సద్వినియోగం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌కమిషనర్‌ వి సత్యనారాయణ మాట్లాడుతూ సిబ్బంది పని విభాగాలను పక్కాగా నిర్వర్తించేలా కేటాయింపులు చేశామని అన్నారు. పౌరసేవలపై స్పందించేలా సెక్షన్‌ ఆఫీసర్స్‌, పెట్రోకార్‌, బ్లూకోల్ట్స్‌, రిసెప్షన్‌ సిబ్బందికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కమిషనరేట్‌ సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌, టెక్‌టీం, స్పెషల్‌ బ్రాంచ్‌, స్థానిక అధికారులతో ఆన్‌లైన్‌ మోసాలు, వ్యవస్తీకృత నేరాలపై నిఘా ఉంచామన్నారు. ఆన్‌లైన్‌ పేకాట గ్రూపులు, గుట్కా, గంజాయి రవాణా ముఠాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ జి చంద్రమోహన్‌, ఏసీపీలు జె విజయసారధి, తుల శ్రీనివాసరావు, మదన్‌లాల్‌, ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు, సీఐలు రాజేష్‌, నటేష్‌, లక్ష్మిబాబు, దామోదర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, కృష్ణారెడ్డి, రవికుమార్‌, మురళి, శివకుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement