Abn logo
Sep 20 2021 @ 23:27PM

రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించండి

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు


 మంత్రి అప్పలరాజు

పలాస, సెప్టెంబరు 20: రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆదేశించారు. సోమవారం పలాసలో ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పలాస నియోజకవర్గంలో ప్రధాన రహదారుల నిర్మాణాలకు టెండర్లు పూర్తి కావడంతో పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ రూరల్‌ రోడ్‌ ప్రాజెక్టు కింద ఎనిమిది కొత్త పనులకు టెండర్లపై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అభివృద్ధి పనులకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. నువ్వలరేవు నుంచి కొత్తపేట రహదారికి టెండర్లపై  చర్చించారు. ఇటీవల నిర్మించిన ప్రభుత్వ భవనాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రామకృష్ణ, పీఆర్‌ డీఈఈ ఎస్‌.రామకృష్ణ, టి.రవిబాబు, నాగభూషణం, పాల్గొన్నారు.