పారిశుధ్యంపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-06-09T04:33:14+05:30 IST

పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.

పారిశుధ్యంపై దృష్టి సారించాలి
క్షెట్టిపేటలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

లక్షెట్టిపేటరూరల్‌, జూన్‌ 8 : పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్‌ బుధవారం పర్యటించి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం మండలంలోని కొత్తూరు గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో మురికి కాలువల పూడికతీత పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చైతన్యవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌, ఎంపీడీవో మేనేజర్‌ నాగేశ్వర్‌రెడ్డి, ఏపీవో వెంకటరమణ, కౌన్సిలర్‌ మెట్టు రాజుకళ్యాణి తదితరులు పాల్గొన్నారు. 

 దండేపల్లి: గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా సిబ్బంది పర్యావేక్షించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ సూచించారు.  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలం మ్యాదరిపేట, దండేపల్లిచ కర్ణపేట గ్రామాలను ఆయన సందర్శించి గ్రామంలో చేపట్టే కంపోస్ట్‌షెడ్‌, శ్మశానవాటిక నిర్మాణ పనులు, పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిలించారు. .కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేషం, ఎంపీవో మోఘమాల, సర్పంచులు చంద్రకళ, రాజేశ్వరీ, ఉప సర్పంచు భూమన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-09T04:33:14+05:30 IST