టీచర్ల భర్తీపై దృష్టి

ABN , First Publish Date - 2022-01-23T06:24:24+05:30 IST

జిల్లాలో టీచర్ల కొరతను భర్తీ చేసి, నాణ్యమైన చదువులు అందే లక్ష్యంగా పనిచేస్తానని డీఈవో వి.శేఖర్‌ చెప్పారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

టీచర్ల భర్తీపై దృష్టి
డీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న శేఖర్‌

డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన శేఖర్‌ 


చిత్తూరు(సెంట్రల్‌), జనవరి 22: జిల్లాలో టీచర్ల కొరతను భర్తీ చేసి, నాణ్యమైన చదువులు అందే లక్ష్యంగా పనిచేస్తానని డీఈవో వి.శేఖర్‌ చెప్పారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిండ్ర మండలం మిట్టకండ్రిగ గ్రామానికి చెందిన శేఖర్‌ రైతు కుటుంబంలో జన్మించారు. నిండ్ర ప్రభుత్వ పాఠశాలలో టెన్త్‌, నగరిలో డిగ్రీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీఈడీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1993లో అనంతపురం జిల్లా బుక్కపట్నంలో డైట్‌ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఈయన కడప జిల్లా రాయచోటి, కార్వేటినగరంలో డైట్‌లోనూ అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం పుత్తూరు డీవైఈవోగా, రాయచోటి, కార్వేటినగరంలో డైట్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదోన్నతిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలోని టెట్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా వెళ్లారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీచర్లు కొరత ఉన్నచోట భర్తీ చేయడంతో పాటు బోధన పద్ధతుల్లో మార్పులు తీసుకు వచ్చి మరింత నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. 

Updated Date - 2022-01-23T06:24:24+05:30 IST