సమస్యలు సృష్టించే వారిపై దృష్టి పెట్టండి

ABN , First Publish Date - 2022-01-15T05:05:50+05:30 IST

సమస్యలు సృష్టించే వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు.

సమస్యలు సృష్టించే వారిపై దృష్టి పెట్టండి
ధన్వాడ స్టేషన్‌లో మొక్కలు నాటుతున్న ఎస్పీ

- ఎస్పీ వెంకటేశ్వర్లు 

- జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్ల తనిఖీ 

- రికార్డుల పరిశీలన, సిబ్బందికి సూచనలు


ధన్వాడ, జనవరి 14 : సమస్యలు సృష్టించే వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం ధన్వాడ స్టేషన్‌ను ఎస్పీ అక స్మికంగా తనిఖీ చేసి, స్టేషన్‌ పరిసరాలను పరీశీలిం చారు. అనంతరం ఎస్సై రమేష్‌తో పాటు, సిబ్బంది నుద్ధేశించి ఎస్పీ మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఒమైక్రాన్‌ వైరస్‌పై అప్రమత్తంగా ఉం డాలన్నారు. స్టేషన్‌లో రికార్డులను పరీశీలించి, పెం డింగ్‌ కేసుల పురోగతి, ఆన్‌లైన్‌ నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ స్టేషన్‌లో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట మరికల్‌ సీఐ శివకుమార్‌, ఎస్సై రమేష్‌ ఉన్నారు.


  వైరస్‌లపై అప్రమత్తంగా ఉండాలి

మాగనూరు : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగు తున్న కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌లపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం మాగనూరు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేసి, రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్‌, నేనుసైతం కార్యక్రమాలపై ప్రజలకు అవ గాహన కల్పించడంతో పాటు, గ్రామాల్లో సీసీ కెమె రాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. వారంలో ఒకరోజు స్టేషన్‌ పరిసరాల్లో స్వచ్ఛభారత్‌ నిర్వహిం చాలన్నారు. ఎస్పీ వెంట మక్తల్‌ సీఐ శంకర్‌, ఎస్సై శివనాగేశ్వర్‌ నాయుడు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.


చెక్‌పోస్టు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి

కృష్ణా : కృష్ణా మండలం గుడెబల్లూర్‌ గ్రామ శివారులోని కృష్ణానది ఒడ్డున ఉన్న వాసునగర్‌ చెక్‌ పోస్టు, చేగుంట గ్రామ శివారులో ఉన్న చెక్‌పోస్టు లను ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. మూడో దశ కరోనా, ఒమైక్రాన్‌ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణా టక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు, ప్రయాణికులను క్షుణ్ణంగా తని ఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. అనుమా నం వచ్చిన వారిని హోంక్వారంటైన్‌, ఆసుపత్రికి తరలించాలన్నారు. అదేవిధంగా, స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక దృష్టి సారించి రౌడీషీటర్‌ నమోదు చేయాలని ఆదే శించారు. మండలం నుంచి ఇసుక, మట్కా, గుట్కా, పేకాట వాటిని అరికట్టేందుకు తగు చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట మక్తల్‌ సీఐలు శంకర్‌, రామ్‌లాల్‌, ఎస్సైలు నాగరాజు, శివ నాగేశ్వర్‌నాయుడు, రమేష్‌, పోలీస్‌ సిబ్బంది ఉ న్నారు. 



Updated Date - 2022-01-15T05:05:50+05:30 IST