May 18 2021 @ 12:08PM

అలాంటి పాత్రల మీదే దృష్టి పెడతాను : అంజలి

అంజలి రీసెంట్‌గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్‌'లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినీ వర్గాల నుంచి కూడా బాగానే ప్రశంసలు దక్కాయి. రీసెంట్‌గా ఈ సినిమా ఓటీటీలో రిలీజై అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దాంతో 'వకీల్ సాబ్‌'ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ  సోషల్ మీడియా ద్వారా తెలియజేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక పై కూడా ఇలాంటి బలమైన పాత్రలే చేస్తానని తెలిపింది. ఈ సినిమా ఎప్పటికీ గర్వంగా చెప్పుకునేది ..నా కెరీర్‌లో మైల్ స్టోన్‌లా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలిపింది అంజలి. ఇంతక ముందుకు వెంకటేష్, మహేష్ బాబు నటించిన మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.. 'మసాలా', 'డిక్టేటర్', 'గీతాంజలి' సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. 'సరైనోడు'లో స్పెషల్ సాంగ్‌లో కనిపించి ఆకట్టుకుంది. మళ్ళీ ఇంతకాలానికి 'వకీల్ సాబ్‌'తో ఫాంలోకి వచ్చిన అంజలికి ఇప్పుడు మంచి పాత్రలు అవకాశాలు వస్తున్నట్టు సమాచారం.