కోస్తాలో పొగమంచు

ABN , First Publish Date - 2021-01-18T08:05:24+05:30 IST

: కోస్తాలో అనేకచోట్ల పొగమంచు కురిసింది. పంటలు వున్న పొలాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకుంది.

కోస్తాలో పొగమంచు

విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కోస్తాలో అనేకచోట్ల పొగమంచు కురిసింది. పంటలు వున్న పొలాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకుంది. ఆకాశం నిర్మలంగా ఉండి, రాత్రిపూట భూమి వేగంగా చల్లబడుతుండడంతో పొగమంచు కురుస్తోందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. దీనినే రేడియేషన్‌ కూలింగ్‌ అంటారని పేర్కొన్నారు. మరికొద్ది రోజులు పొగమంచు కురుస్తుందని పేర్కొన్నారు. కాగా కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగింది. అరకులోయలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

Updated Date - 2021-01-18T08:05:24+05:30 IST