దైవ వాక్యాన్ని అనుసరిద్దాం

ABN , First Publish Date - 2021-09-17T05:30:00+05:30 IST

విశ్వాసి దైవాన్ని ఎంతగా ఆరాధిస్తాడో... దైవ వాక్యాన్ని కూడా అంతే పవిత్రంగా భావించాలి. దేవుని వాక్యం గురించి హెబ్రీయులు అధ్యాయం ఇలా వివరిస్తోంది: ‘‘దేవుని వాక్యం సజీవమైనది, అది అనంత శక్తిమంతమైనది

దైవ వాక్యాన్ని అనుసరిద్దాం

విశ్వాసి దైవాన్ని ఎంతగా ఆరాధిస్తాడో... దైవ వాక్యాన్ని కూడా అంతే పవిత్రంగా భావించాలి. దేవుని వాక్యం గురించి హెబ్రీయులు అధ్యాయం ఇలా వివరిస్తోంది: ‘‘దేవుని వాక్యం సజీవమైనది, అది అనంత శక్తిమంతమైనది. ఇరువైపులా పదునుగా ఉన్న కత్తి కన్నా పదునైనది. అది ఎంత లోతుగా చొరబడుతుందంటే, మానవుడు బయటకు కనిపించేదానికీ, అతని అంతరంగంలో ఉన్నదానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించగలదు. అది శరీరంలోని కీళ్ళ లోపలికీ, మూలుగలోకీ కూడా దుసుకుపోగలదు. హృదయాలలోని ఊహలనూ, ఉద్దేశాలనూ బయటపెట్టగలదు’’ అని. అంతేకాదు, దేవుని వాక్యం మానవాళికి వెలుగు చూపించే దీపం. ఆ దైవాన్ని చేరుకొనే మార్గం. యుద్ధంలో ఆయుధం, విజయానికి మార్గదర్శకం. విముక్తి పొందే శక్తిని అది అందిస్తుంది. నైరాశ్యాన్ని దూరం చేసి, ఆశను చిగురింపజేస్తుంది. చెడు ఆలోచనలను కడిగేసి, మనల్ని పరిశుద్ధులను చేస్తుంది. ఎదుగుదలకు దోహదపడుతుంది. మన పాపాలను ప్రక్షాళన చేస్తుంది. మంచి చెడుల విచక్షణ కలిగిస్తుంది. అంతటి మహిమ కలిగిన దైవ వాక్యాన్ని మనసా వాచా అనుసరించాలి. దాన్ని పాటించే విశ్వాసులు దైవానికి ప్రీతిపాత్రులవుతారు. పరలోక రాజ్యంలో మన్ననలు పొందుతారు. 

Updated Date - 2021-09-17T05:30:00+05:30 IST