Abn logo
May 27 2020 @ 17:55PM

గైడ్‌లైన్స్‌ ప్రకారమే ‘కరోనా వైరస్’‌ షూటింగ్‌: ఆర్జీవీ

ముంబై: దేశం మొత్తం కరోనాతో వణికిసోతోంది. లాక్‌డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు పనులు నిలిచిపోయాయి. ఇలాంటి సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘కరోనా వైరస్’ అనే ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవలే ఆర్జీవీ విడుదల చేశారు. అది చూసిన ప్రజలకు చిత్ర షూటింగ్ ఎప్పుడు? ఎలా? జరిగిందో అర్థంకాలేదు. దీనిపై ఆర్జీవీ ఓ క్లారిటీ ఇచ్చారు. లాక్‌డౌన్ మార్గదర్శకాలు పాటిస్తూనే సినిమా షూటింగ్ చేశామని స్పష్టంచేశారు. అగస్త్య మంజు డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది హారర్‌ సినిమా కాదని, మనతోపాటు గొప్పగొప్ప రాజకీయ వేత్తలు, అధికారుల్లో అంతర్గతంగా ఉన్న భయాందోళనల గురించి చెప్పే కథాంశం అని వర్మ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement