Abn logo
Oct 6 2020 @ 16:04PM

మహిళల్లో పొట్టచుట్టూ కొవ్వు ఏర్పడడానికి కారణం..?

ఆంధ్రజ్యోతి(06-10-2020)

ప్రశ్న: మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు ఎలాంటి ఆహారపు జాగ్రత్తలు పాటించాలి?


- గాయత్రి, ఆదిలాబాద్‌


డాక్టర్ సమాధానం: మెనోపాజ్‌ దాటిన మహిళల్లో కెలోరీల అవసరం కొంత తగ్గుతుంది కానీ విటమిన్లు, ఖనిజాల ఆవశ్యకత పెరుగుతుంది. ఈ సమయంలో వైద్యుల సలహామేరకు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాల సప్లిమెంట్లను తీసుకోవచ్చు. మెనోపాజ్‌లో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అధికమవుతుంది. బరువు నియంత్రణలో ఉంచేందుకు  ఎక్కువ శ్రమపడవలసి ఉంటుంది. అన్నం కంటే కూర, పప్పు ఎక్కువగా తినడం, రోజుకు కనీసం రెండున్నర లీటర్ల నీళ్లు తాగడం, రెండు మూడు సార్లు పండ్లు తీసుకోవడం మంచిది. మెనోపాజ్‌ దశలో ముఖ్యంగా ఎముకల దృఢత్వం తగ్గకుండా ఉండాలంటే కాల్షియం బాగా ఉండే పాలు, పెరుగు, పనీర్‌, అన్ని రకాల గింజలు దినసరి ఆహారంలో భాగం చేసుకోవాలి. పచ్చళ్ళు, ఉప్పు, కారం పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు, టీలు, కాఫీలు మానెయ్యడం లేదా తక్కువగా తీసుకోవడం మొదలుపెట్టాలి. వారంలో కనీసం ఐదురోజులు, రోజుకు నలభై ఐదు నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. కేవలం నడక మాత్రమే కాకుండా ఎముకల దృఢత్వాన్ని కాపాడే వ్యాయాయం చెయ్యాలి. రాత్రివేళ ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement