ఫుడ్‌ డెలివరీ రోబో

ABN , First Publish Date - 2020-12-12T07:39:13+05:30 IST

ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే డెలివరీ బాయ్‌ తీసుకుని వస్తాడు. కానీ ఇది కరోనా సమయం. బాయ్స్‌ తీసుకొచ్చే ఫుడ్‌ను తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడటం లేదు.

ఫుడ్‌ డెలివరీ రోబో

ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే డెలివరీ బాయ్‌ తీసుకుని వస్తాడు. కానీ ఇది కరోనా సమయం. బాయ్స్‌ తీసుకొచ్చే ఫుడ్‌ను తీసుకోవడానికి కస్టమర్లు ఇష్టపడటం లేదు. అందుకే రష్యా రాజధాని మాస్కోలోని ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు రోబోను రంగంలోకి దించారు. ఇప్పుడు కస్టమర్లకు ఈ రోబోనే ఫుడ్‌ డెలివరీ చేస్తోంది.


మాస్కోలో ‘యాండెక్స్‌ డాట్‌ ఈట్స్‌’ అనే సంస్థ ఫుడ్‌తో పాటు ఇతర ఆహార వస్తువుల సరఫరా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆ సంస్థే ఫుడ్‌ డెలివరీ రోబోను రూపొందించింది. యాండెక్స్‌ డాట్‌ రోవర్‌ అని పిలిచే ఈ రోబో ఆర్డర్స్‌ రావడమే ఆలస్యం మీల్స్‌ను డెలివరీ చేస్తోంది.


రోబో ముందుగా రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్‌ను తీసుకుంటుంది. తరువాత కస్టమర్‌కు ఫుడ్‌ను డెలివరీ చేస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌ సహాయంతో రోబోను అన్‌లాక్‌ చేసి ఫుడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


ప్రస్తుతం మాస్కోలోని వైట్‌ స్క్వేర్‌ ఏరియాలో రోబోల సహాయంతో ఫుడ్‌ డెలివరీ చేస్తున్నారు. ఇక్కడ విజయవంతం అయితే ఇతర ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

Updated Date - 2020-12-12T07:39:13+05:30 IST