కాకులకు ఆహారం... ఆయనకు ఉపాధి...

ABN , First Publish Date - 2021-05-17T22:04:59+05:30 IST

కాకులు... ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెద్దగా కనిపించడంలేదు. దాదాపు ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. అలాగే... దేశ రాజధాని ఢిల్లీలో కూడా అంతే. అయితే... అక్కడ ఓ పెద్దాయనకు మాత్రం అవే ఉపాధిగా మారాయి. అదెలాగంటే... ఈ కథనం చదవండి.

కాకులకు ఆహారం... ఆయనకు ఉపాధి...

న్యూఢిల్లీ : కాకులు... ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెద్దగా కనిపించడంలేదు. దాదాపు ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. అలాగే... దేశ రాజధాని ఢిల్లీలో కూడా అంతే. అయితే... అక్కడ ఓ పెద్దాయనకు మాత్రం అవే ఉపాధిగా మారాయి. అదెలాగంటే... ఈ కథనం చదవండి. 


చనిపోయిన పెద్దవాళ్లకు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తూండడం సహజం. ఈ శ్రార్ధ కర్మల్లో పిండప్రదానం ప్రవినమైనది., అంతేకాదు... పవిత్రమైన ప్రక్రియ కూడా భావిస్తుంటారు. కాగా... పిండప్రదానం చేయడానికి కాకులు అవసరం అవుతాయన్న విషయం తెలిసిందే. అయితే... పెరిగిపోతున్న నగరీకరణ, రేడియేషన్ తదితర పరిణామాల నేపధ్యంలో... పలు జాతుల జంతువులు, పక్ఉల మాదిరిగానే కాకులు కూడా  అంతరించిపోతున్నాయి.


ఈ నేపధ్యంలో... పెద్ద నగరాల్లో కాకులు మచ్చుకైనా కనిపించడం లేదు.  అయితే, ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన ఈ పరిణామాలనే ఉపాధిగా  మలచుకున్నాడు. రెండు కాకులను పెంచి పెద్ద చేశాడు.  అవే ఇప్పుడు ఆయనకు ఉపాధి కల్పిస్తుండడం విశేషం. కాకులు పిండాలను తింటూ ఆయనకు డబ్బులు సంపాదించిపెడుతున్నాయి. అటు వాటికీ... కడుపు నిండుతోంది. ఆయనకు జేబులు నిండుతున్నాయి. ఆసక్తిగా ఉంది కదూ..!

Updated Date - 2021-05-17T22:04:59+05:30 IST