Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడలో ఫుడ్ జైలు.. క్యూ కడుతున్న భోజన ప్రియులు

విజయవాడ:  ఫుడ్ లవర్స్ ఎక్కడ వెరైటీ ఫుడ్ కనిపిస్తే అక్కడికి పరుగులు పెడతారు. వారి కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ప్రత్యేక పేజీలుంటాయి. అయితే ఇప్పుడు విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వెరైటీ ఆలోచనతో ఏర్పాటు చేసిన ఫుడ్ జైల్ భోజన ప్రియులను ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ రెస్టారెంట్‌లో వడ్డించే వారు సైతం ఖైదీల డ్రస్సులను ధరించి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. నిజంగా జైల్లో కూర్చుని భోజనం చేస్తుట్లు ఫీల్ ఉండటంతో భోజనప్రియులు సైతం ఈ రెస్టారెంట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. పోలీస్ డ్రెస్‌లో ఉన్నటువంటి వెయిటర్ ఆర్డర్‌ను తీసుకోవడం అలాగే ఖైదీ దుస్తుల్లో ఉన్న వెయిటర్ భోజనం వడ్డించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement