కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-01-04T18:37:38+05:30 IST

కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయిన సంఘటన చింతామణి తాలూకాలోని కైవార హోబళి మస్తేనహళ్లిలో చోటుచేసుకుంది. హొబళి శివారులో అల్పసంఖ్యాక సంక్షేమ శాఖకు

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులకు అస్వస్థత

           - మొరార్జీదేశాయ్‌ వసతి పాఠశాలకు తరలి వచ్చిన యంత్రాంగం


చింతామణి(కర్ణాటక): కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయిన సంఘటన చింతామణి తాలూకాలోని కైవార హోబళి మస్తేనహళ్లిలో చోటుచేసుకుంది. హొబళి శివారులో అల్పసంఖ్యాక సంక్షేమ శాఖకు చెందిన మొరార్జీదేశాయ్‌ వసతి పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారంగా వెజిటబుల్‌ పలావ్‌ వడ్డించారు. తిన్న కొద్దిసేపటికే పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొం తమంది వాంతులు చేసుకున్నారు. తక్షణం టిఫిన్‌ వడ్డించడం ఆపేసి వైద్యులకు సమాచారం అందించారు. 60 మందిలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ప్రాణాపాయం లేదని, చికిత్స అందచేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వెజిటబుల్‌ పలావ్‌ కోసం ఉపయోగించిన సోయాబీన్స్‌ చెడిపోకుండా మాత్రలు ఉంచారు. వండేటప్పుడు మాత్రలు తొలగించకపోవడంతోనే అస్వస్థతకు కారణమని తెలుస్తోంది. కైవార పాథ్రమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు దివ్య, సిబ్బంది, కైవార అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై సుబ్రహ్మణి వసతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సకాలంలో వైద్యం అందించడంలో సహకరించారు. చిక్కబళ్లాపుర జిల్లా ఆరోగ్యాధికారి ఇందిరా ఆర్‌ కబాడియా తదితర అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-01-04T18:37:38+05:30 IST